మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెతికితే దుర్గ గుడిలో మాయమైన మూడు సింహాల విగ్రహాలు ప్రత్యక్షమవుతాయని తెదేపా నేత అయ్యన్నపాత్రుడు ఆరోపించారు. విగ్రహాలు మాయమవ్వడం బాధాకరమన్న ఆయన.. చోరీ జరిగిన విషయం స్పష్టంగా కనిపిస్తుంటే కొంతమంది మూర్ఖులు అసలు ఉన్నాయో? లేవో? అని, లాకర్లో ఉన్నాయని, స్టోర్ రూంలో ఉన్నాయని ప్రకటనలు చేస్తున్నారని మండిపడ్డారు. వెతకాల్సింది లాకర్లోనో, స్టోర్ రూమ్‌లోనో కాదని, దుర్గమ్మ గుడికి కూతవేటు దూరంలో ఉన్న మంత్రి ఇంట్లోనని అయ్యన్న వ్యాఖ్యానించారు.
సింహాల ప్రతిమలు మంత్రి వెల్లంపల్లి ఇంట్లో వెతకాలి: అయ్యన్న - మంత్రి వెల్లంపల్లిపై అయ్యన్నపాత్రుడు కామెంట్స్
దుర్గమ్మ దేవస్థానంలోని వెండి రథంలోని మూడు సింహాల ప్రతిమలు దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇంట్లో వెతకాలని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. విగ్రహాలు మాయం కావడం బాధాకరమని వ్యాఖ్యానించారు.
tdp leader ayyanna comments on minister vellampalli
TAGGED:
tdp leader ayyanna comments