రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ధ్వజమెత్తారు. సీఎం జగన్ చెప్పిన మద్యపాన నిషేధం హామీ ఏమైందని.. ఆయన ప్రశ్నించారు. మద్యం దుకాణాలు పెంచడమే.. మద్యపాన నిషేధమా అని నిలదీశారు. మద్యం మత్తులో మునిగి తేలుతున్న వైకాపా ప్రభుత్వానికి.. మహిళలు మత్తు వదిలించడం ఖాయమని చెప్పారు.
రాష్ట్రంలో మద్యం దుకాణం లేని గ్రామం లేదని ఆక్షేపించారు. పర్యాటక ప్రాంతాల్లో 300 దుకాణాలు ఏర్పాటుకు ప్రణాళికలు వేసి.. అందులో 41 షాపుల్ని అందుబాటులోకి తెచ్చారని విమర్శించారు. వాక్ ఇన్ స్టోర్ పేరుతో 90 మద్యం మాల్స్ కు అనుమతిలిచ్చి.. 21 మాల్స్ ని ఇప్పటికే ప్రారంభించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.25 వేల కోట్ల అప్పు కోసం.. భవిష్యత్ లో మద్యం ద్వారా వచ్చే ఆదాయాన్ని తాకట్టు పెట్టారని మండిపడ్డారు.