ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు: అచ్చెన్న - అచ్చెన్న తాజా వార్తలు

కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆక్షేపించారు. రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని అన్నారు.

కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు
కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు

By

Published : May 1, 2022, 9:56 PM IST

కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు

రాష్ట్రంలో రామరాజ్యం రావాలంటే.. చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. కార్మికులను గౌరవించే సంస్కారం ముఖ్యమంత్రి జగన్​కు లేదని.. వారి సంపదను దోచుకున్నారని ఆయన ఆరోపించారు. విజయవాడలో టీఎన్​టీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్మిక దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న అచ్చెన్న.. చంద్రబాబు హయాంలో కార్మికులకు రూ.5 లక్షల బీమా ఇచ్చామని గుర్తు చేశారు.

సీఎం జగన్ మాత్రం ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారని ఆక్షేపించారు. ఆర్టీసీ ఆస్తులను దోచుకునేందుకే ప్రభుత్వంలో విలీనం చేశారని అచ్చెన్న ఆరోపించారు. మూడేళ్ల జగన్ పాలనలో రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాకపోగా.. ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలివెళుతున్నాయన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ కావటానికి జగనే కారణమని అన్నారు. దేశంలో పవర్ హాలిడే ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్​ మాత్రమేనని వ్యాఖ్యనించారు.

"కార్మికులను గౌరవించే సంస్కారం సీఎం జగన్‌కు లేదు. రాష్ట్రాన్ని జగన్ సర్వనాశనం చేశారు. ఆర్టీసీ ఆస్తులు దోచుకోవటానికి ప్రభుత్వంలో విలీనం చేశారు. పవర్ హాలిడే ఇచ్చిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌. ఒక్క అవకాశమని రాష్ట్రాన్ని 20 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లారు. హోంమంత్రిగా తానేటి వనిత అనర్హురాలు." - అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు

ఇదీ చదవండి: ఆ మహిళల ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పగలదా ?: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details