వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. వైకాపా అరాచక పాలనపై ఉన్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని ఆయన మండిపడ్డారు. తెదేపా ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇంటిపై వైకాపా కార్యకర్తల దాడియత్నించడం హేయమైన చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి, అక్రమాలపై ప్రశ్నించడం తప్పా? అంటూ నిలదీశారు. అధికార పార్టీ నేతల అక్రమాలను చూస్తూ ఊరుకోబోమన్న అచ్చెన్న.. మూడేళ్లుగా అంగుళం అభివృద్ధి చేయని వైకాపా నేతలను ఆ పార్టీ కేడర్ ప్రశ్నించాలన్నారు.
వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ.. ఓటమి భయం: అచ్చెన్నాయుడు - tdp state president atchannaidu
అధికార పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే దాడులకు తెగబడుతున్నారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ ఓటమి భయం పట్టుకుందని ధ్వజమెత్తారు.
![వైకాపాలో లీడర్ నుంచి కేడర్ వరకూ.. ఓటమి భయం: అచ్చెన్నాయుడు atchannaidu slammed on ysrcp](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14972776-215-14972776-1649498084163.jpg)
tdp leader atchannaidu