ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Atchannaidu on Kuna Ravi Arrest: అర్థరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరమేంటి ? -అచ్చెన్నాయుడు - జగన్ పై అచ్చెన్నాయుడు విమర్శలు

అర్థరాత్రి తలుపులు పగలగొట్టి కూన రవికుమార్​ను అరెస్టు చేయాల్సిన అవసరం ఏంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు (Atchannaidu questioned on Kuna Ravi arrest) ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే..వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి లేదా ప్రభుత్వాన్ని నిలదీశారు.

Achennaidu on Kuna Ravi Arrest
అర్థరాత్రి అరెస్టు చేయాల్సిన అవసరమేంటి ? -అచ్చెన్నాయుడు

By

Published : Nov 21, 2021, 10:02 AM IST

కూన రవికుమార్‌ అరెస్టును తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజారాపు అచ్చెన్నాయుడు ఖండించారు. అర్థరాత్రి తలుపులు పగలగొట్టి మరీ అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. మహిళల్ని కించపరిచే హక్కు వైసీపీకి ఉంటే..వాటిపై నిరసన తెలిపే హక్కు టీడీపీకి లేదా అని నిలదీశారు. రవికుమార్​ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ (Atchannaidu demanded for kuna ravi release)చేశారు. నీచ రాజకీయాలకు జగన్ రెడ్డి ఒడిగడుతున్నారని, రాష్ట్రంలో కావాలనే ఉద్రిక్తలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. వరదలతో రాయలసీమ అతలాకుతలమై ప్రజలు ప్రాణాలు విడుస్తుంటే దానిపై దృష్టిపెట్టకుండా టీడీపీ నేతల్ని ఎలా అరెస్టు చేయాలి, కార్యకర్తల్ని ఏవిధంగా హత్యలు చేయాలని జగన్ ఆలోచిస్తున్నారని విమర్శించారు. తెదేపా నేతలను అరెస్టులు చేస్తే వరదల్లో చనిపోయినవారు, నష్టపోయిన పంటలు తిరిగిరావని హితువుపలికారు. నిండు సభలో చేసిన తప్పులకు క్షమాపణలకు చెప్పకుండా వాఖ్యల పట్ల ఆందోళన చేసిన వారిని అక్రమంగా అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఎన్ని దాడులు, అక్రమ అరెస్టులు చేయించినా జగన్ సమయం మరో రెండున్నరేళ్లే అని గుర్తు పెట్టుకోవాలని హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details