తనకు అదనపు భద్రత కల్పించాలని కోరుతూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. సంఘ విద్రోహ శక్తులు, నక్సలైట్లు, ఇతర క్రిమినల్స్‌తో తనకు ప్రాణాపాయం ఉందని లేఖలో పేర్కొన్నారు. అందువల్ల ప్రస్తుతం తనకు కల్పిస్తున్న 1+1 భద్రతను 4+4కు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగట్టే క్రమంలో తాను విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తున్నానని.. తెలుగుదేశం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, శాసనసభ పక్ష ఉపనేతగానూ వ్యవహరిస్తున్నందున కోరిన మేరకు భద్రత కల్పించాలన్నారు.
"నాకు ప్రాణాపాయం ఉంది.. భద్రత పెంచండి" డీజీపీకి అచ్చెన్నాయుడు లేఖ - Atchenniah Letter To DGP
Atchenniah Letter To DGP: రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాశారు. తనకు ప్రాణహాని ఉన్నందున అదనపు భద్రత కల్పించాలని లేఖలో పేర్కొన్నారు.
అచ్చెన్నాయుడు