ap news: వైకాపా రెండున్నరేళ్ల పాలనంతా(ysrcongress government) ప్రజలు, ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై దాడులు, దౌర్జన్యాలు అరాచకాలే తప్ప అభివృద్ది శూన్యమని.. తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్ష్యుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే.. ఆ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం తుమ్మలపాలెంలో తెదేపా మహిళా సర్పంచ్ ఇంటిపై.. వైకాపా నేతల దాడిని ఖండించారు.
Atchannaidu: రెండున్నరేళ్ల వైకాపా పాలనలో అభివృద్ధి శూన్యం: అచ్చెన్నాయుడు - ap political
వైకాపా రెండున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యేలు అసెంబ్లీలో మహిళల్ని బూతులు తిడుతుంటే ఆ పార్టీ కార్యకర్తలు గ్రామాల్లో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అచ్చెన్నాయుడు
హోంమంత్రి నియోజకవర్గంలో మహిళలపై దాడులు జరుగుతున్నాయంటే రాష్ట్రంలో సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. అధికారం ఉందని బరితెగించిన వారికి రాబోయే రోజుల్లో బడితెపూజ ఖాయమని హెచ్చరించారు. వైకాపాకు కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు. వచ్చేఎన్నికల్లో అధికారంలోకి వచ్చేది తెలుగుదేశమేనని చెప్పారు. మహిళా సర్పంచ్ ఇంటిపై దాడికి పాల్పడ్డవారిని వెంటనే అరెస్టు చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: