ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Ashok Babu on PRC: పీఆర్​సీతో ఉద్యోగులకు.. రూపాయి కూడా లాభం లేదు: అశోక్‌బాబు - ap employees prc

TDP leader ashok babu comments on PRC: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన పీఆర్​సీపై తెదేపా నేత ఆశోక్​బాబు స్పందించారు. ఈ పీఆర్సీతో ఉద్యోగులకు రూపాయి కూడా బెన్‌ఫిట్‌ లేదన్నారు. అంతేకాదు.. ఉద్యోగులకు భవిష్యత్తులో ఎంతో నష్టం జరుగుతుందని అన్నారు.

Ashok Babu on PRC
Ashok Babu on PRC

By

Published : Jan 7, 2022, 7:58 PM IST

TDP leader ashok babu comments on PRC: ముఖ్యమంత్రి జగన్​ ప్రకటించిన పీఆర్​సీ వల్ల రిటైరయ్యే ఉద్యోగులకు నష్టం జరుగుతుందని తెదేపా నేత అశోక్‌బాబు పేర్కొన్నారు. ప్రభుత్వం ఉద్యోగులను వంచించిందన్న అశోక్‌బాబు.. ఈ పీఆర్సీ వల్ల ఉద్యోగులకు రూపాయి కూడా బెన్‌ఫిట్‌ లేదన్నారు. అన్ని డీఏలూ ఇస్తామంటున్నారన్న అశోక్ బాబు.. అదేమీ దానం కాదన్నారు.

ఇక, సీపీఎస్‌పై స్పందిస్తూ.. దీనిపై నిర్ణయం తీసుకోవడానికి జూన్‌ దాకా సమయం కావాలా? అని ప్రశ్నించారు. హెచ్‌ఆర్‌ఏ స్లాబులపై ప్రభుత్వం ఏమీ చెప్పలేదన్నారు. ఇక నుంచి సెంట్రల్‌ పీఆర్‌సీ ఇస్తామని సీఎం చెబుతున్నారన్న అశోక్.. రాష్ట్ర పీఆర్‌సీ వేరు, సెంట్రల్ పీఆర్‌సీ వేరని విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలన్నారు. అదేవిధంగా.. తాజా ప్రకటనతో భవిష్యత్తులో ఎంత నష్టం జరుగుతుందో ఉద్యోగులు గమనించాలని సూచించారు.


ఇదీ చదవండి..TDP Protest Against Illegal Mining: "వైకాపా మంత్రులు, ఎమ్మెల్యేల కనుసైగల్లోనే.. ఇసుక దోపిడీ"

ABOUT THE AUTHOR

...view details