ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైకాపా నేతల అవినీతిని ప్రశ్నించినందుకే సుబ్బయ్య దారుణ హత్య' - tdp leader killed in prodhuturu

చేనేత కార్మికుడు నందం సుబ్బయ్య దారుణ హత్యకు వైకాపా నాయకులే కారకులని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. అధికార పార్టీ నేతల అవినీతి, అక్రమాలను ప్రశ్నించినందుకే ఈ దారుణానికి పాల్పడ్డారని ఆమె పేర్కొన్నారు.

Anuradha on podduturu  issue
వాళ్ల అవినీతిని ప్రశ్నించారనే సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారు

By

Published : Dec 29, 2020, 7:30 PM IST

కడప జిల్లా ప్రొద్దుటూరులో వైకాపా నాయకులు చేసే అక్రమాలు, అవినీతిని ప్రశ్నించినందుకే నందం సుబ్బయ్యను దారుణంగా హత్య చేశారని తెదేపా ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ ఆరోపించారు. ఇళ్ల పట్టాల పేరుతో వైకాపా నేతలు రూ. వేల కోట్లు కుంభకోణానికి పాల్పడ్డారని పేర్కొన్నారు. చేనేత వర్గాలపై దాడులు, దౌర్జన్యాలు, హత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ధర్మవరం, మంగళగిరి నుంచి ఈ దుస్థితి ప్రొద్దుటూరు వరకు పాకిందన్నారు. చేనేత కార్మికుల ఉసురు సీఎం జగన్​కు తప్పక తగులుతుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details