ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని

కరోనా మూడో దశ ఉద్ధృతికి తెరతీసేలా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వ్యవహరిస్తున్నారని రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. పరీక్షలు పెట్టాలనుకోవడం మూర్ఖత్వమేనని స్పష్టం చేశారు.

విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని
విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు: అనగాని

By

Published : Jun 7, 2021, 11:44 AM IST

దేశంలో అనేక రాష్ట్రాలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ బోర్డులు పరీక్షలు రద్దు చేస్తే ఏపీలో మాత్రం నిర్వహించాలనుకోవడం మూర్ఖత్వమేనని ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ మండిపడ్డారు. పిల్లలపై మూడో దశ ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తుంటే విద్యార్థుల ప్రాణాలకు పరీక్ష పెట్టేలా రివర్స్ నిర్ణయాలు ఎలా తీసుకుంటారని నిలదీశారు.

తమ తమ ఇళ్ల నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి, మంత్రులు.. విద్యార్థులు మాత్రం పరీక్షల కోసం దూర ప్రయాణాలు చేయాలని ఆలోచించటం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేసి విద్యార్థుల్ని పై తరగతులకు ప్రమోట్ చేయాలని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details