TDP Leader Anagani on Cine Industry : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం సినీపరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షలాది మందిని బలిచేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను జగన్ వేధిస్తుంటే ఆ రంగ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదని మండిపడ్డారు. ఉచిత ఇసుక రద్దు చేసి వందలాది మంది భవన నిర్మాణ కార్మికులను బలితీసుకున్నట్లుగానే ఇప్పుడు సినీ కార్మికులను బలి తీసుకుంటున్నారని దుయ్యబట్టారు. సినిమాల్లో చూపించే హీరోయిజం సినీ పరిశ్రమను వేధింపులకు గురిచేస్తున్న జగన్ సర్కార్ పై ఎందుకు చూపించటం లేదని ప్రశ్నించారు. రీల్ హీరోలుగానే మిగిలిపోకుండా రియల్ హీరోలుగా మారాలని సూచించారు. కావేరి నది జలాల సమస్య, జల్లికట్టు అంశాలపై అక్కడి సినీ పరిశ్రమంతా ఏకతాటిపై వచ్చిన స్ఫూర్తిని ఇక్కడి వారు కూడా కనబరచాలని కోరారు.
TDP Leader Anagani on Cine Industry : సినీరంగ పెద్దలు మాట్లాడరేం ? -అనగాని సత్యప్రసాద్ - TDP Leader Anagani on Cine Industry
TDP Leader Anagani on Cine Industry : ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తన వ్యక్తిగత స్వార్థం కోసం సినీ పరిశ్రమపై ఆధారపడి ఉన్న లక్షలాది మందిని బలిచేస్తున్నారని తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమను జగన్ వేధిస్తుంటే ఆ రంగ పెద్దలు ఎందుకు నోరు మెదపటం లేదని మండిపడ్డారు.
సినీరంగ పెద్దలు మాట్లాడరేం ? -అనగాని సత్యప్రసాద్, తెదేపా ఎమ్మెల్యే