ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

SEC:'అధికారులు వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గారు'.. ఎస్​ఈసీకి తెదేపా నేత ఆలపాటి లేఖ - ఎస్​ఈసీకి తెదేపా నేత ఆలపాటి లేఖ వార్తలు

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని తెదేపా నేత ఆలపాటి రాజా రాష్ట్ర ఎన్నికల కమిషనర్​కు లేఖ రాశారు. అధికారులు పలువురు తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారని.. వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు.

అధికారులు వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గారు
అధికారులు వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గారు

By

Published : Nov 7, 2021, 7:37 PM IST

స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు వైకాపా ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారని తెదేపా నేత ఆలపాటి రాజా ఆరోపించారు. ఈ మేరకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు లేఖ రాశారు. అధికారులు పలువురు తెదేపా అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించారన్నారు. నెల్లూరులో భారీగా నామినేషన్ల తిరస్కరణకు గురయ్యాయని.., దాచేపల్లిలో ఎమ్మెల్యే ఒత్తిడితోనే తెదేపా అభ్యర్థి నామినేషన్ తిరస్కరించారని ఆరోపించారు. కొన్ని చోట్ల ఆర్వోలు ఎన్‌వోసీలను చించేశారని..,నామినేషన్లు తిరస్కరించిన ఆర్వోలపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని..,తెదేపా అభ్యర్థులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.

ABOUT THE AUTHOR

...view details