వైఎస్సార్ హయాంలో దోచింది చాలదన్నట్లుగా.. సీఎం జగన్ రెడ్డి ప్రకృతి వనరుల్ని దోచేస్తున్నారని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగపేట బైరైటీస్ నుంచే జగన్ ఖనిజ దోపిడీ మొదలైందని ఆరోపించారు. మంచి పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి, ప్రజల్ని దోచుకుంటున్నారని ఆలపాటి రాజా ధ్వజమెత్తారు.
ALAPATI RAJA: 'సీఎం జగన్ ప్రకృతి వనరులను దోచేస్తున్నారు' - bauxite mining in vizag district
సీఎం జగన్మోహన్రెడ్డిపై(CM jagan) తెదేపా నేత ఆలపాటి రాజా(TDP leader alapati raja) ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖ మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను తవ్వి సొంత పరిశ్రమకు తరలిస్తున్నారని ఆరోపించారు. మంచి పాలన అందిస్తామని చెప్పి, ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు.
తెదేపా నేత ఆలపాటి రాజా
విశాఖ మన్యంలో లేటరైట్ పేరుతో బాక్సైట్‌ను అక్రమంగా తవ్వి, సొంత సిమెంట్ పరిశ్రమకు తరలిస్తున్నారని ఆలపాటి రాజా ఆరోపించారు. ప్రభుత్వానికి ధైర్యం ఉంటే అక్రమ మైనింగ్‌పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎవరి ఆదేశానుసారం అక్రమ మైనింగ్ జరుగుతుందో సమాధానం చెప్పాలన్నారు.
ఇదీచదవండి.