ప్రభుత్వం రైతులకు కంటితుడుపు చర్యగానే 1500కోట్లు బీమా చెల్లింపు ప్రకటించిందని తెదేపా నేత, మాజీ మంత్రి ఆలపాటి రాజా మండిపడ్డారు. రైతులకు న్యాయం చేయకుండా ఎగ్గొట్టేందుకే ఈ క్రాఫ్ట్ రిజిస్టర్ అయిన వారికి మాత్రమే నష్టపరిహారం అందచేస్తున్నారని ధ్వజమెత్తారు. రైతుకు నష్టం జరిగిందా లేదా అని పరిశీలించకుండా గోరంత ఇస్తూ కొండంత ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. గత ఏడాది ఖరీఫ్ నుంచి 37 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు.. 15 వేల కోట్లు నష్టపోయారన్నారు. 58లక్షల మందికి పరిహారం ఇస్తానని చెప్పి 26లక్షల మందికే దానికి కుదించటంతో పాటు తూతూ మంత్రంగా దానిని అమలు చేస్తున్నారని ఆరోపించారు. పంటల బీమా ప్రీమియం చెల్లించకుండా అసెంబ్లీలో సీఎం అసత్యాలు చెప్పారని విమర్శించారు.
తూతూ మంత్రంగా బీమా చెల్లింపు అమలు: ఆలపాటి రాజా
వైకాపా ప్రభుత్వం కంటితుడుపు చర్యగా రైతులకు బీమా చెల్లింపు ప్రకటించిందని తెదేపా నేత ఆలపాటి రాాజా విమర్శించారు. రైతులకు బీమా ఎగ్గొట్టేందుకే ఈ క్రాఫ్ట్ రిజిస్టర్ అయిన వారికే నష్టపరిహారం ఇస్తున్నారని ధ్వజమెత్తారు.
tdp leader alapati raja