రాష్ట్రంలో దేవాలయాలపై జరుగుతున్న దాడులపై సీబీఐ విచారణకు కేంద్రానికి భాజపా లేఖ రాయాలని.. తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు. దేవాలయాలపై భాజపాకు ఉన్న ప్రేమ మాటల్లో కాకుండా చేతల్లో చూపించాలని విమర్శించారు.
ఆలయాలపై దాడుల అంశాన్ని భాజపా పక్కదోవ పట్టిస్తోందని.. క్రైస్తవుడైన డీజీపీ తిరుమల వెళ్తే డిక్లరేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ వల్ల రాష్ట్రంలో ప్రజలకు, ఆలయాలకూ రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆరోపణలు చేశారు. దేవాలయాలపై దాడులు జరుగుతుంటే, తమపై నిందలు వేస్తున్నారని దుయ్యబట్టారు. ఆలయాలను కాపాడే విషయంలో సీఎం విఫలమయ్యారని అచ్చెన్న ధ్వజమెత్తారు.