రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ తెలుగుదేశం పోరాడుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెప్పారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ నేటి నుంచి ఈ నెలాఖరు వరకూ తెదేపా చేపట్టే నిరసన కార్యక్రమాల్లో ప్రజలంతా పాల్గొనాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లలో రూ.36వేల కోట్ల విద్యుత్ భారం మోపారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ హయాంలో రూపాయి కూడా విద్యుత్ ఛార్జీలు పెంచలేదని.. కానీ కరోనా సంక్షోభంలోనూ జగన్‌రెడ్డి ఛార్జీలు పెంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ కొనుగోలు ఛార్జీలు తగ్గుతున్నా వినియోగదారులపై భారం మోపటం తగదన్నారు. ఛార్జీలు పెంచనని ఎన్నికలు ముందు ఇచ్చిన హామీపై జగన్ రెడ్డి మడమతిప్పారని చెప్పారు.
ACHENNAIDU: 'విద్యుత్ ఛార్జీలు తగ్గించే వరకూ పోరాటం చేస్తాం'
రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు(Current charges) తగ్గించే వరకూ పోరాటం చేస్తామని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు(achennaidu) స్పష్టంచేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈ నెలాఖరు వరకు నిరసనలు(protests) చేపడుతున్నట్లు వెల్లడించారు.
తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు