ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'పోలవరాన్ని ఉద్ధరించామంటున్నారుగా.. మరి ఈ నిర్బంధాలు ఎందుకు?' - వైకాపా ప్రభుత్వంపై అచ్చెన్నాయుడు విమర్శలు

పోలవరం సందర్శిస్తున్నారంటే వైకాపా ప్రభుత్వానికి అంత భయం ఎందుకని తెదేపా నేత అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారని విమర్శించారు. సీపీఐ నేతల గృహ నిర్బంధాలను ఖండించారు.

achhennaidu
అచ్చెన్నాయుడు, తెదేపా రాష్ట అధ్యక్షుడు

By

Published : Nov 22, 2020, 2:18 PM IST

ప్రజల తిరుగుబాటుతో సీఎం జగన్ పతనం మొదలైందని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీపీఐ, సీపీఎం నేతల గృహ నిర్బంధం ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమన్నారు. పోలవరం సందర్శన పిలుపుతో జగన్ ప్రభుత్వ పునాదుల్లో వణుకు పుడుతోందని.. చేతగానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికే అక్రమ అరెస్టులు, నిర్బంధాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పోలవరాన్ని ముఖ్యమంత్రి సుడిగుండంలో నెట్టేశారని విమర్శించారు. ప్రజలు నిలదీస్తారనే భయంతోనే గృహనిర్భంధాలు, అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. పోలవరాన్ని ఉద్ధరించామని చెప్పుకుంటున్న ప్రభుత్వం.. ఈ అరెస్టులు ఎందుకు చేస్తోందని నిలదీశారు. వైకాపా ప్రభుత్వం చేసిన పనుల్ని చూద్దామంటే ఎందుకు అడ్డుకుంటున్నారని అచ్చెన్న మండిపడ్డారు.

ABOUT THE AUTHOR

...view details