ఆంధ్రప్రదేశ్

andhra pradesh

మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లఘించారు: ఎస్​ఈసీకి ఫిర్యాదు

By

Published : Jan 28, 2021, 3:47 PM IST

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు 2019 ఓటర్ల జాబితా ప్రకారం నిర్వహిస్తుండటానికి.. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి బాధ్యత వహించాలని న్యాయవాది గుడపాటి లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. ఈమేర రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు.

మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లఘించరాని ఎస్​ఈసీకి తెదేపా ఫిర్యాదు
మంత్రులు ఎన్నికల కోడ్ ఉల్లఘించరాని ఎస్​ఈసీకి తెదేపా ఫిర్యాదు

2019 ఓటర్ల జాబితా ప్రకారం పంచాయతీ ఎన్నికలు నిర్వహించడానికి.. పంచాయతీరాజ్ శాఖ మంత్రే కారణమని... న్యాయవాది లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్​ఈసీకి ఫిర్యాదు చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలకు వ్యతిరేకంగా అధికారులను మంత్రి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని.. తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details