ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​ పాలనలో కుంభకోణాలు హద్దు మీరాయి: కళా వెంకట్రావు - జగన్​పై కళా వెంకట్రావు కామెంట్స్​

చిరు ఉద్యోగుల లంచాలపై జగన్‌ కఠిన చట్టం చేస్తారన్నారని.. వైకాపా నేతల భారీ కుంభకోణాలపై ఎందుకు చట్టం చేయరని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ప్రశ్నించారు. 15 నెలల జగన్ పాలనలో కుంభకోణాలు హద్దు మీరాయని ఆరోపించారు.

tdp kala venkatrao on ysrcp govt
tdp kala venkatrao on ysrcp govt

By

Published : Aug 25, 2020, 8:45 PM IST

నేతల అవినీతిపై ప్రజల్లోబాగా వ్యతిరేకత వ్యక్తమవుతోందని తెదేపా నేత కళా వెంకట్రావు వ్యాఖ్యానించారు. అవినీతిని కప్పిపుచ్చుకునేందుకే లంచాల చట్టం పేరుతో కొత్త నాటకం ఆడుతున్నారని విమర్శించారు. ఇసుక కుంభకోణాలు అరికట్టాలంటే ఉచిత ఇసుక విధానం ప్రవేశపెట్టాలని.. అంబులెన్సుల కుంభకోణానికి పాల్పడిన విజయసాయిరెడ్డిపై రాజకీయ చర్యలు తీసుకోవాలన్నారు. కరోనా కిట్ల కుంభకోణానికి ప్రయత్నించిన వారిపై చర్యలు తీసుకోవాలని కళా డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details