దేవాలయాల్లో హుండీల కంటే మంత్రి వెల్లంపల్లి ఇంట్లో హుండీనే ఎక్కువ నిండుతోందని తెదేపా నేత జలీల్ ఖాన్ ఎద్దేవా చేశారు. విజయవాడ దుర్గ గుడిలో కోటిన్నర విలువ చేసే స్క్రాప్‌ను మంత్రి రూ.15 లక్షలకే అమ్మేశారని ఆరోపించారు.
అధికారుల బదిలీల్లో వెల్లంపల్లి భారీగా దోచుకుంటున్నారని విమర్శించారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి వెల్లంపల్లికి లేదన్న ఆయన... పోలీసులు లేకపోతే ప్రజలే వైకాపా నేతల భరతం పట్టేవారని దుయ్యబట్టారు.