TDP fires on YSRCP: వివేకా హత్యను గుండెపోటుగా చిత్రీకరించిన వైకాపా నేతలు.. ఇప్పుడు కల్తీ సారా మరణాలకు అనారోగ్యాన్ని అంటగడుతున్నారని.. తెదేపా నేతలు మండిపడ్డారు. జగన్ పాదయాత్రలో ఇచ్చిన మద్యపాన నిషేధ హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనేందుకు తెదేపా శాసనసభ సభ్యులు సచివాలయం అగ్నిమాపక కేంద్రం నుంచి ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ.. అసెంబ్లీకి వెళ్లారు. జంగారెడ్డిగూడెంలో కల్తీసారా తాగి చనిపోయిన బాధిత కుటంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
జంగారెడ్డిగూడెం కల్తీ సారా మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని నేతలు దుయ్యబట్టారు. కల్తీసారా అరికట్టి.. రాష్ట్రంలో మద్యనిషేధం అమలు చేయాలనే చిత్తశుద్ధి ప్రభుత్వానికి లేదన్నారు.