ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు' - చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు

చంద్రబాబును రాష్ట్రం నుంచి దూరం చేయాలని వైకాపా కుట్రలు చేస్తోందని తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. కరకట్టపై ఉన్న ఇళ్లంటినీ చేతనైతే కూల్చాలని సవాల్ విసిరారు.

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు'

By

Published : Sep 25, 2019, 8:44 PM IST

'చంద్రబాబును రాష్ట్రానికి దూరం చేయాలని వైకాపా కుట్రలు'

తెదేపా అధినేత చంద్రబాబుపై రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరిత చర్యలు చేపడుతోందని పార్టీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు ఆరోపించారు. విజయవాడ తెదేపా కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. నోటీసులు ఇచ్చిన 24 కట్టడాల విషయంలో చేతనైతే చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరారు. ప్రజలు అనధికారికంగా కట్టుకున్న ఇళ్లకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చిన సంఘటనలు ఉన్నాయన్నారు. ముఖ్యమంత్రి తీరుతో ప్రజలు విసుగెత్తిపోయారని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న చర్యలను కోర్టులు, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా... ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో ముందుకు వెళ్తున్నారని ఆగ్రహించారు. చంద్రబాబును రాష్ట్రం నుంచి దూరం చేయాలని వైకాపా కుట్రలు చేస్తోందన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కరకట్టపై మాత్రమే ఉంటున్నారని, ప్రజా సమస్యలు పట్టించుకోవడంలేదని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details