ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి.. తెదేపా నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు.. - జడ్జి రామకృష్ణ సోదరుడిపై దాడి

రాష్ట్రంలో ఎస్సీలకు రక్షణ లేకుండా పోయిందని తెదేపా నేత కళా వెంకట్రావు విమర్శించారు. న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడిపై దాడి ఘటనపై నిజనిర్ధరణ కమిటీ వేశామని ఆయన అన్నారు. దళితుల హక్కులను కాలరాస్తూ... ఉద్దేశపూరిత దాడులకు పాల్పడటం దుర్మార్గమని ఆయన మండిపడ్డారు.

తెదేపా నిజనిర్ధరణ కమిటీ
తెదేపా నిజనిర్ధరణ కమిటీ

By

Published : Sep 28, 2020, 7:53 PM IST

న్యాయమూర్తి రామకృష్ణ సోదరుడు రామచంద్రపై జరిగిన దాడిపై నిజనిర్ధరణ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావు తెలిపారు. కమిటీ సభ్యులుగా పాశం సునీల్ కుమార్, నెలవల సుబ్రహ్మణ్యం, పంతగాని నరసింహ ప్రసాద్, జేడీ రాజశేఖర్, ఏ. పీటర్లను నియమించామన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రామచంద్రను కమిటీ సభ్యులు పరామర్శించినున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయిందని కళా... విమర్శించారు. దళితుల హక్కులను కాలరాస్తూ... ఉద్దేశపూరిత దాడులకు పాల్పడటం దుర్మార్గమని మండిపడ్డారు. 16 నెలల కాలంలో 152కు పైగా దాడులు జరిగాయని.., దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details