KONAKALLA: మచిలీపట్నం ఎంపీ బాలశౌరిపై తెలుగుదేశం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ మంత్రి పేర్ని నానితో సత్సంబంధాలు ఉన్నాయంటూ బాలశౌరి చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఆధారంతో పేర్ని నానికి, తనకు సత్సంబంధాలు ఉన్నాయని ఆరోపించారో సమాధానం చెప్పాలన్నారు. తన గురించి మాట్లాడే అర్హత బాలశౌరికి ఎవరిచ్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నాని తనకు రాజకీయ ప్రత్యర్థి అని స్పష్టం చేసిన కొనకళ్ల.. నానితో తన బంధం ఇదేనని తేల్చి చెప్పారు. తమ ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయంటూ నిరాధార ఆరోపణలు చేసిన బాలశౌరి.. బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పేర్ని నానితో.. నా బంధం అదే :కొనకళ్ల - కృష్ణా జిల్లా తాజా వార్తలు
KONAKALLA: మాజీ మంత్రి పేర్ని నానితో తనకు సత్సంబంధాలు ఉన్నాయంటూ.. ఎంపీ బాలశౌరి చేసిన వ్యాఖ్యలను తెలుగుదేశం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ ఖండించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన బాలశౌరి బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
పేర్ని నాని నా రాజకీయ ప్రత్యర్థి