TDP LEADER GANTA: పాఠశాలల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన పథకాన్ని తెదేపా ప్రభుత్వమే ప్రారంభించిందని ఆ పార్టీ నేత, విద్యాశాఖ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. వైకాపా అధికారంలోకి వచ్చాక దానికి 'నాడు-నేడు' అని పేరు పెట్టి గొప్పగా చెబుతోందన్నారు. వైకాపా ప్లీనరీలో సీఎం జగన్ విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణలంటూ 'నాడు-నేడు' గురించి సుదీర్ఘ ఉపన్యాసం ఇచ్చారని.. ఈ పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసి పనులు ప్రారంభించింది తెదేపానేనని స్పష్టం చేశారు. హైబ్రిడ్ యాన్యుటీ విధానం కింద పలు సమావేశాలు నిర్వహించి.. నిపుణుల కమిటీ ద్వారా తెదేపా ప్రభుత్వం పథకాన్ని అమలు చేసిందని గంటా తేల్చిచెప్పారు.
"ఆ పథకాన్ని ప్రవేశపెట్టింది తెదేపానే.. వైకాపా పేరు మార్చింది" - తెదేపా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు
TDP LEADER GANTA: పాఠశాలల్లో వసతుల కల్పన పథకాన్ని తెదేపానే ప్రారంభించిందని ఆ పార్టీ నేత గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఆ పథకానికే 'నాడు-నేడు' అంటూ వైకాపా ప్రభుత్వం గొప్పలు చెబుతోందని మండిపడ్డారు. విద్యారంగ సంస్కరణలు అంటూ జగన్ ప్లీనరీలో చెప్పారు కానీ.. పథకాన్ని సృష్టించింది, రూపకల్పన చేసింది మాత్రం తెదేపా ప్రభుత్వమేనని స్పష్టం చేశారు.
జగన్ అధికారంలోకి వచ్చాక దానికి 'నాడు-నేడు' అని పేరు పెట్టి.. వారి గొప్పతనంగా చెప్పడాన్ని ఆయన విచక్షణకే వదిలేస్తున్నానన్నారు. తెదేపా ప్రభుత్వం అకడమిక్ క్యాలెండర్ను రూపొందించి అమలు చేసిందని వివరించారు. అద్భుత ఫలితాలను సాధించిందని, దీనికి పూర్తి భిన్నంగా మూడేళ్లలో ఫలితాలు ఏ స్థాయికి దిగజారిపోయాయో గణాంకాలే సాక్ష్యమని గంటా మండిపడ్డారు. మెగా డీఎస్సీ నిర్వహించి పెద్దఎత్తున ఉపాధ్యాయులను నియమించామన్న గంటా.. సీఎం జగన్ దీనికి భిన్నంగా ఉపాధ్యాయ నియామకాల బదులు హేతుబద్ధీకరణ పేరుతో 8 వేల పాఠశాలలను మూసివేయడం అన్యాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వ పాలన పట్ల ఉపాధ్యాయులు ఏ స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారో చూస్తున్నామన్నారు.
ఇవీ చదవండి: