MP Gorantla video issue: ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే జగనే సస్పెండ్ అవుతారని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ హెచ్చరించారు. ఎంపీ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామనేది బూటకమని.. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్ధారించే టెక్నాలజి వచ్చిందన్నారు. జగన్‌కి ధైర్యం ఉంటే హైదరాబాద్‌లోని సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని సవాల్ చేశారు. అత్యాచారం జరిగిన చోటుకి హోంమంత్రి వెళ్లాలన్నా.. సీఎం అనుమతి కావాల్సి రావటం పరిపాలనా దుస్థితని దుయ్యబట్టారు. వార్డు మెంబర్‌గా కూడా పనికిరాని వ్యక్తిని ఎంపీ చేసి రాష్ట్ర పరువు తీశారని విమర్శించారు. రాష్ట్ర పరువు కాపాడాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి జగన్‌పై ఉందని ఆలపాటి అన్నారు.
ఎంపీ మాధవ్‌ని సస్పెండ్ చేయకపోతే.. జగనే సస్పెండ్ అవుతారు: ఆలపాటి
ex minister alapati: హిందూపురం వైకాపా ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపామనేది బూటకమని మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. మార్ఫింగ్ జరిగిందో లేదో అరగంటలో నిర్దరించే టెక్నాలజీ వచ్చిందని.. ధైర్యముంటే హైదరాబాద్ సెంట్రల్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపాలని డిమాండ్ చేశారు.
ALAPATI