ఓటమి భయంతోనే వైకాపా మైండ్‌గేమ్ ఆడుతోందని... కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తోందని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు. పోలీసులు ముందుగా మేల్కొని ఎటువంటి అల్లర్లు జరగకుండా చూడాలని కోరారు. తిరుమలలో వైకాపా నాయకురాలు రోజా సీఎంపై చేసిన వ్యాఖ్యలను ఖండించారు. క్విడ్ ప్రోకో ద్వారా జగన్ రాష్ట్రం పరువును తీశారని ఆమె మండిపడ్డారు. కేసుల మాఫీ కోసమే జగన్ రాష్ట్ర పరువును కేసీఆర్ వద్ద తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు.
అల్లర్లు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నం! - తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి
ఎన్నికల కౌంటింగ్ రోజు అల్లర్లు సృష్టించేందుకు వైకాపా ప్రయత్నిస్తోందని తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి ఆరోపించారు.

తెదేపా అధికార ప్రతినిధి దివ్యవాణి