ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Letter: 'జైల్లో నా భర్తకు ప్రాణహాని ఉంది' గవర్నర్​, హైకోర్టు సీజేకు దేవినేని భార్య లేఖలు

TDP Devineni Uma Wife Letters to HC,Governer
'నా భర్తకు ప్రాణహాని ఉంది'

By

Published : Jul 31, 2021, 5:24 PM IST

Updated : Aug 1, 2021, 5:52 AM IST

17:19 July 31

గవర్నర్, హైకోర్టు సీజే, కేంద్ర, రాష్ట్ర హోం మంత్రులకు లేఖలు

గవర్నర్​, హైకోర్టు సీజేకు దేవినేని భార్య అనుపమ లేఖలు

రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో రిమాండ్‌లో ఉన్న తన భర్తకు ప్రాణాపాయం ఉందని, ఆయనకు తగిన భద్రత కల్పించి మైనింగ్‌ మాఫియా నుంచి రక్షించాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు భార్య దేవినేని అనుపమ.. ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా, రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌, హోంమంత్రి మేకతోటి సుచరితలను కోరారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ను అకస్మాత్తుగా బదిలీ చేయడంతో తన భర్త భద్రతపై తీవ్ర సందేహాలు తలెత్తుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు వారందరికీ రాసిన లేఖను శనివారం విడుదల చేశారు. ‘దేవినేని ఉమామహేశ్వరరావు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రజాసేవలో చురుగ్గా పాల్గొంటారు. అవినీతి, మైనింగ్‌ మాఫియాకు వ్యతిరేకంగా పోరాడుతారు. ఫలితంగా మైనింగ్‌ మాఫియాకు చెందిన గూండాలు ఉమాను, ఆయన కుటుంబసభ్యులను, ఆస్తులను లక్ష్యంగా చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే జులై 27న జి.కొండూరు మండలంలో ఆయనపై దాడి జరిగింది. అనంతరం తప్పుడు కేసుల్లో అరెస్టుచేసి రాజమహేంద్రవరం జైలుకు పంపారు. గతంలో జైళ్లలో హత్యలు, వేధింపులు చోటుచేసుకున్నందున రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉమాకు ప్రాణహాని ఉందని ఆయన కుటుంబసభ్యులు, మద్దతుదారులు, అనుచరులు, అభిమానులు భయపడుతున్నారు’ అని లేఖలో అనుపమ తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. రాజమహేంద్రవరం జైలు సూపరింటెండెంట్‌ రాజారావు బదిలీ ఉత్తర్వుల్ని లేఖకు జత చేస్తున్నట్లు పేర్కొన్నారు.

ఉమా కస్టడీ పిటిషన్‌ విచారణ వాయిదా

మచిలీపట్నం (గొడుగుపేట), న్యూస్‌టుడే: రిమాండ్‌లో ఉన్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును పోలీస్‌ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎస్సీ, ఎస్టీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సోమవారానికి వాయిదా పడింది. ఉమాను అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ కేసు విచారణాధికారిగా ఉన్న నూజివీడు డీఎస్పీ శ్రీనివాసులు పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. ఉమా తరఫున వాదన వినిపించేందుకు సోమవారం వరకూ అవకాశం ఇవ్వాలని ఆయన తరఫు న్యాయవాదులు లంకె వెంకటేశ్వరావు, జి.లక్ష్మీనారాయణ శనివారం కోరారు. దీంతో విచారణ వాయిదా వేస్తున్నట్లు ఎస్సీ, ఎస్టీ కేసుల విచారణ ప్రత్యేక న్యాయమూర్తి, పదో అదనపు జిల్లా జడ్జి నరసింహమూర్తి తెలిపారు.

ఇదీ చదవండి

Chandrababu: 'దాడులకు భయపడం.. మాతో పెట్టుకుంటే కాలగర్భంలో కలిసిపోతారు'

Last Updated : Aug 1, 2021, 5:52 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details