ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 29, 2020, 4:38 PM IST

ETV Bharat / city

'నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి రాయితీ చెల్లించాలి'

పంట నష్టపోయిన రైతులను తక్షణం ఆదుకోవాలని తెదేపా డిమాండ్ చేసింది. రైతులకు న్యాయం జరిగేవరకు వాళ్లకు మద్దతుగా పోరాటం చేస్తామని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. పార్టీ పిలుపు మేరకు రైతు సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు.

tdp demands support to the farmers
నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి రాయితీ చెల్లించాలి

పంట నష్టపోయిన రైతులందరికీ పెట్టుబడి రాయితీ చెల్లించాలని అనంతపురం పార్లమెంట్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జిల్లాలోని సోమందేపల్లి మండలం జూలకుంట గ్రామం నుంచి మండ్లి గ్రామం వరకు పాదయాత్ర నిర్వహించారు. నష్టపోయిన రైతులను పరామర్శించారు. వేరుశనగ దిగుబడి భారీగా తగ్గిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరి జిల్లాలో..

అధిక వర్షాలు, తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో వైకాపా ప్రభుత్వం విఫలమైందని తెదేపా నాయకులు విమర్శించారు. ఈ మేరకు తూర్పుగోదావరి జిల్లా పి గన్నవరంలో నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులు ధర్నా చేపట్టారు. అన్నదాతలను తక్షణం ఆదుకోవాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డొక్కా జగన్నాథం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యక్తలు పాల్గొన్నారు.

గుంటూరులో...

రైతులు పండించిన ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తెదేపా మాజీమంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఆరోపించారు. గుంటూరు జిల్లా కొల్లిపరలోని రైతు భరోసా కేంద్రం వద్ద పార్టీ నేతలు, రైతులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. పంటలు నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కొత్త పంటకు అవసరమైన విత్తనాలు ఉచితంగా అందజేయాలన్నారు.

ఇదీ చూడండి:

తెదేపా నేత హత్యకు ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి: చంద్రబాబు

ABOUT THE AUTHOR

...view details