విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై దేవినేని ఉమ ట్వీట్ ఎల్జీ పాలిమర్స్ ఘటనలో 12 మంది చనిపోయి వేలాదిమంది నిరాశ్రయులైతే.. పర్యావరణ ఉల్లంఘన, విధ్వంసం, రాజ్యాంగ ఉల్లంఘన, వాటర్, ఎయిర్ యాక్ట్ సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకోలేరా అని మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ చెప్పే మంచి పేరున్న ఎల్జీ కంపెనీలో అలారం ఎందుకు మోగలేదో.. సీసీ కెమెరాల ఫూటేజ్ ఎందుకు బయటపెట్టడం లేదో చెప్పాలని నిలదీశారు. సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
అసలు కారణాలేంటి?
బాధితులకు పరిహారం చెల్లింపు, పరిశ్రమ ప్రతినిథులతో మధ్యవర్తిత్వంలో ఉన్న వేగం.. విషపూరితమైన స్టైరిన్ గ్యాస్ లీకవ్వడానికి గల కారణాలు, దానికి కారకులు ఎవరు అనే విషయాలు తెలుసుకోవడంలో ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపడం లేదని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయం అడుగుతున్న బాధితులపై వేగంగా చర్యలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. లీకేజీకి గల అసలు కారణాలు ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.
ఇవీ చదవండి:
మరో 50 మందికి పాజిటివ్: రాష్ట్రంలో కరోనా కేసులు 1980