ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎంకు లైవ్​లో మాట్లాడటం రాదా?: తెదేపా

సీఎం జగన్​కు లైవ్​లో మాట్లాడటం రాదని...తప్పులు దొర్లుతాయనే ఎడిట్ చేసి ప్రసారం చేశారని తెదేపా విమర్శించింది.

tdp criticise on cm jagan
సీఎం జగన్​

By

Published : Apr 29, 2020, 9:18 AM IST

ముఖ్యమంత్రి జగన్ ప్రజలను ఉద్దేశించి లైవ్​లో మాట్లాడలేరా అని తెదేపా ప్రశ్నించింది. ముఖ్యమంత్రి ప్రసంగాన్ని ముందే చిత్రీకరించి... ఎడిట్ చేసి ప్రసారం చేశారని విమర్శించింది. జగన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మాట్లాడారనుకుంటే అది పొరబడ్డట్టేనని స్పష్టం చేసింది. అది ఎడిట్ చేసిన వీడియో అని తేల్చి చెప్పిన తెలుగుదేశం... సీఎం కనీసం లైవ్ ప్రెస్మీట్​లో కూడా మాట్లాడలేరని ఎద్దేవా చేసింది. లైవ్​లో మాట్లాడితే తప్పులు దొర్లుతాయనే వీడియో పెట్టి మేనేజ్ చేశారని దుయ్యబట్టింది. సీఎం ప్రసంగం వీడియోకు సంబంధించి రెండు నిర్దిష్ట సమయాల్లో తీసిన స్క్రీన్ షాట్ల​ను ట్విట్టర్​లో పెట్టింది. వాటిని పరిశీలిస్తే వీడియో నిడివి 23నిమిషాలుందని, ముఖ్యమంత్రి చేతికి పెట్టుకున్న గడియారం చూపిస్తున్న సమయాల్లోని వ్యత్యాసం 26 నిమిషాలుందని తెలిపింది. దీన్ని బట్టి వీడియోను మధ్యాహ్నమే రికార్డ్ చేసి 3 నిమిషాలు ఎడిట్ చేసి ప్రసారం చేసినట్లు అర్ధమవుతోందని తెదేపా పేర్కొంది.

సీఎం జగన్ పై తెదేపా విమర్శలు

ABOUT THE AUTHOR

...view details