ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'స్పీకర్ గారూ రండి.. న్యాయ వ్యవస్థపై చర్చిద్దాం' - విజయవాడలో న్యాయవాదుల సమావేశం వార్తలు

న్యాయవ్యవస్థ తీరుపై దేశవ్యాప్తంగా ప్రజా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్న శాసన సభాపతి తమ్మినేని సీతారాం వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి న్యాయ వ్యవస్థలను తప్పుపట్టడం సరికాదని హితవు పలికాయి. న్యాయ వ్యవస్థపై చర్చకు సిద్ధమని... దీనికి తమ్మినేని సీతారాంనే ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తామని భారత న్యాయవాదుల సంఘం తెలిపింది.

cpi ramakrishna, tdp kanakamedala
cpi ramakrishna, tdp kanakamedala

By

Published : Jul 5, 2020, 2:35 PM IST

Updated : Jul 5, 2020, 3:42 PM IST

శాసన మండలిలో బిల్లులను సెలక్ట్ కమిటీకి పంపకుండా అడ్డుకోవడం రాజ్యాంగ బద్ధమా అని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు. న్యాయవ్యవస్థలపై చర్చ జరగాలన్న స్పీకర్ తమ్మినేని వ్యాఖ్యలపైభారత న్యాయవాదుల సంఘం ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరయ్యారు. మండలి రద్దు తీర్మానం చేసి తిరిగి అదే మండలికి సభ్యుడిని ఎలా ఎన్నుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ పదవికి రాజ్యాంగం రక్షణ కోరుకోకుండా పక్కన పెట్టి సామాన్య పౌరుడిగా చర్చకు రండి... అంశాల వారీగా బహిరంగంగా చర్చిద్దాం అని స్పష్టం చేశారు.

బెదిరింపు వ్యాఖ్యలు...

సభాపతి వ్యాఖ్యలను సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ కూడా తప్పుబట్టారు. న్యాయస్థానాలను సైతం బెదిరించేలా వ్యాఖ్యలు చేస్తున్నారని విమర్శించారు.

శాసన సభాపతి తమ్మినేని సీతారాం న్యాయ వ్యవస్థలపై చర్చ జరగాలన్నారు. దీనిపై చర్చకు సిద్ధం. తమ్మినేనినే ముఖ్య అతిథిగా చర్చకు ఆహ్వానిస్తాం. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి న్యాయ వ్యవస్థలపై అయన చేసిన వ్యాఖ్యలు సరైనవి కాదు. ఈ తరహా వ్యాఖ్యలు చేయాలనుకుంటే క్యాబినేట్ హోదాలోకి వెళ్లండి. రాష్ట్రంలో ప్రజాస్వామ్య పద్ధతిలో పాలన సాగడం లేదు- రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Last Updated : Jul 5, 2020, 3:42 PM IST

ABOUT THE AUTHOR

...view details