విజయవాడ నగరపాలక సంస్థల ఎన్నికల్లో తెదేపా, సీపీఐ అభ్యర్థుల విజయం ఖాయమని.. మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా జోస్యం చెప్పారు. నగరంలో సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణతో కలిసి ఆయన ప్రచారంలో పాల్గొన్నారు. 36 డివిజన్లో తెదేపా, సీపీఐ కార్యాలయ ప్రారంభోత్సవంలో ఉమా మాట్లాడుతూ.. ఒక్క ఛాన్స్, నవరత్నాలు అని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. నవరత్నాలు నూటికి 20 మందికి కూడా ఇవ్వడంలేదని సాక్ష్యాలతో చూపిస్తామన్నారు. గతంలో అమలు చేసిన అన్న క్యాంటీన్, చంద్రన్న బీమా, నిరుద్యోగ భృతి, పెళ్లి కనుక వంటి అనేక పథకాలను ఏ కారణంతో రద్దు చేశారని ప్రశ్నించారు. వైకాపాలో నేర చరిత్ర ఉన్న వాళ్లను అభ్యర్థులుగా నిలబెట్టారని ఆరోపించారు. ప్రజలు మంచివాళ్లను ఎన్నుకోవాలని సూచించారు.
తెదేపా - సీపీఐ అభ్యర్థుల విజయం ఖాయం: బొండా - Vijayawada Municipal Corporation Elections
ఎన్నికల ముందు అమరావతే రాజధాని అని ప్రకటించిన జగన్... మాట తప్పడంతో విజయవాడ నగర అభివృద్ధి దారుణంగా దెబ్బతిందని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. అమరావతి దెబ్బ పేద, మధ్య తరగతి, చిరు వ్యాపారులు, కార్మికుల జీవనోపాధిపై పడిందన్నారు.
TDP-CPI candidates' victory confirmed: Bonda