TDP-Congress Alliance: కేంద్ర పాలిత ప్రాంతం అయిన అండమాన్-నికోబార్ దీవుల్లో మున్సిపల్, పంచాయతీ ఎన్నికల కోసం తెలుగుదేశం పార్టీతో అండమాన్ నికోబార్ దీవుల కాంగ్రెస్ విభాగం పొత్తు పెట్టుకుంది. బుధవారం గాంధీభవన్‌లో అండమాన్ నికోబార్ టెరిటోరియల్ కాంగ్రెస్ కమిటీ (ఏఎన్‌టీసీసీ) అధ్యక్షుడు రంగాలాల్ హల్దర్, తెలుగుదేశం పార్టీ స్థానిక అధ్యక్షుడు మాణిక్యరావు యాదవ్‌లు సమావేశమై కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ (పీబీఎంసీ) ఎన్నికల్లో తెదేపా వార్డు నంబర్ 2, 5, 16 నుంచి పోటీ చేసేందుకు అంగీకారం కుదిరింది.
" ఏ అండ్ ఎన్ ఐలాండ్స్‌లో అభివృద్ధి, ప్రజాస్వామ్య పాలన కోసం కాంగ్రెస్, తెదేపాలతో కూడిన కూటమిని ఏర్పాటు చేసాము. మేము విజయం కోసం కృషి చేస్తాము. ఈ కూటమి పోర్టుబ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్, పంచాయతీ ఎన్నికలలో కాంగ్రెస్‌కు విజయం సాధించడంలో సహాయపడుతుందని నేను విశ్వసిస్తున్నాను” -హల్దర్
ఈ కేంద్రపాలిత ప్రాంతంలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు మార్చి 6న జరగనున్నాయి. పంచాయతీ, పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ కౌన్సిల్ ఎన్నికలకు ఫిబ్రవరి 4న నోటిఫికేషన్ విడుదల కానుంది.