ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు నిరంకుశత్వానికి నిదర్శనం: కళా - kala venkatrao on capital news

అమరావతి పరిధిలో రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు సరికాదని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు.

tdp condemn farmers arrest
tdp condemn farmers arrest

By

Published : Dec 29, 2019, 11:22 PM IST

రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు నిరంకుశత్వానికి నిదర్శనం: కళా

అమరావతి రైతుల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు గర్హణీయమని తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు మండిపడ్డారు. రైతుల ఇళ్లలో అర్ధరాత్రి సోదాలు ప్రభుత్వ నిరంకుశత్వానికి నిదర్శనమని విమర్శించారు. ఆధార్ కార్డు ఉంటేనే స్వగ్రామాల్లోకి అనుమతిస్తామనడం దారుణమన్నారు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉందనే విషయాన్ని గుర్తించాలన్నారు. అణచివేయాలని చూస్తే ప్రజలే తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. రైతుల విషయంలో ప్రభుత్వ తీరు మార్చుకోకపోతే....భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని కళా వెంకట్రావు అన్నారు.

ABOUT THE AUTHOR

...view details