ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది: తెదేపా - వైకాపాపై ఎస్​ఈసీ ఫిర్యాదు చేసిన తెదేపా

ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఖూనీ చేస్తోందని తెదేపా నేతలు మండిపడ్డారు. పంచాయతీ, పురపాలిక ఎన్నికల నిర్వహణపై నేతలు ఎస్​ఈసీని కలిశారు. పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలను రద్దు చేయటంతో పాటు, పురపాలిక ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని కోరారు.

వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది
వైకాపా ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోంది

By

Published : Feb 16, 2021, 3:49 PM IST

రాష్ట్రంలో వైకాపా నేతల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయని తెదేపా నేతలు మండిపడ్డారు. పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అరాచకాలను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినట్లు నేతలు బొండా ఉమ, ఆలపాటి రాజా, అశోక్ బాబు స్పష్టం చేశారు. కడప జిల్లా సింహాద్రిపురంలో ఓ మహిళ చీనితోట నరికేసిన విషయాన్ని ఎస్​ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఉమ వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఉంచాలని..,ఏకగ్రీవాలు రద్దు చేసి ఎన్నికలు జరపాలని కోరామన్నారు.

ప్రజాస్వామ్యాన్ని వైకాపా ప్రభుత్వం ఖూనీ చేస్తోందని ఆలపాటి రాజా మండిపడ్డారు. పురపాలిక ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇవ్వాలని అన్ని పార్టీలు ఎస్​ఈసీని డిమాండ్ చేశాయన్నారు. నామినేషన్లకు రెండు రోజులు అవకాశం ఇవ్వాలని ఎస్​ఈసీని కోరినట్లు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details