పుట్టినరోజు సందర్భంగా బెజవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను తెదేపా అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. చంద్రబాబుకు ఆలయ ఈవో భ్రమరాంబ స్వాగతం పలికారు. ప్రజలకు దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని చంద్రబాబు తెలిపారు. జనపక్షాన పోరాడేందుకు శక్తి సామర్థ్యాలు ఇవ్వాలని.. ప్రజల ఇబ్బందులు తొలగించాలని కోరుకున్నానని స్పష్టం చేశారు.
తెలుగు జాతికి పూర్వ వైభవం తెచ్చేందుకు ప్రయత్నిస్తా... తప్పకుండా జయం సాధిస్తాననే నమ్మకం ఉంది. రాజీలేని పోరాటంతో ప్రజలకు అండగా నిలబడతాను. అభిమానుల అంచనాల ప్రకారం ముందుకెళ్తాం. -చంద్రబాబు, తెదేపా జాతీయ అధ్యక్షుడు