పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాళులర్పించారు. భారత జాతీయోద్యమానికి అండగా ఒక జెండాను అందించి తెలుగువారి దేశభక్తికి ప్రతీకగా, సృజనాత్మకతకు గర్వకారణంగా పింగళి వెంకయ్య నిలిచారని కొనియాడారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడైన మహనీయుడు స్మృతికి నివాళులర్పిస్తున్నట్లు ట్వీట్ చేశారు.
పింగళి వెంకయ్యకు చంద్రబాబు, నారా లోకేశ్ నివాళులు
జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్ నివాళులర్పించారు. నిస్వార్థ దేశభక్తుడు, నిరాడంబరుడు అని కొనియాడారు.
చంద్రబాబు, నారా లోకేశ్
జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను "జపాన్ వెంకయ్య, పత్తి వెంకయ్య, డైమండ్ వెంకయ్య" అని ప్రజలు ముద్దుగా పిలుచుకుంటారని నారా లోకేశ్ అన్నారు. ఆ పేర్లు ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనమన్నారు. ఆయన జయంతి సందర్భంగా నారా లోకేశ్ నివాళులర్పించారు.
ఇదీ చదవండి
పింగళి తయారు చేసిన జాతీయ పతాకం.. జాతికే గర్వకారణం