జమ్ముకశ్మీర్ ముష్కరుల కాల్పుల్లో గుంటూరు జిల్లా జవాను జశ్వంత్ రెడ్డి మృతి చెందారు. నిన్న రాజౌరి జిల్లా సుందర్బనీ సెక్టార్‌లో ఉగ్రవాదులకు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో జశ్వంత్ రెడ్డి వీరమరణం పొందారు.
'జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదులపై జరిగిన పోరులో రాష్ట్రానికి చెందిన జవాను జశ్వంత్ రెడ్డి చూపిన ధైర్యసాహనాలకు వందనాలు' అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. 23ఏళ్ల వయస్సులోనే దేశం కోసం ప్రాణత్యాగం చేసిన జశ్వంత్ రెడ్డికి.. సెల్యూట్ చేసే బృందంలో తాను చేరుతున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. జవాను కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.