ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu letter: స్నేహపూర్వక పోలీసింగ్ అమలుకు చొరవ చూపాలి: గవర్నర్​కు చంద్రబాబు లేఖ - ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండాలని గవర్నర్​కు చంద్రబాబు లేఖ

cbn letter to governer
గవర్నర్​కు చంద్రబాబు లేఖ

By

Published : Jun 8, 2021, 12:09 PM IST

Updated : Jun 8, 2021, 1:02 PM IST

12:06 June 08

ఫ్రంట్​ లైన్ వారియర్లను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి

గవర్నర్​కు చంద్రబాబు లేఖ

రాష్ట్రంలో స్నేహపూర్వక పోలీసింగ్ అమలయ్యేలా చొరవ చూపాలని.. గవర్నర్(governer) బిశ్వభూషణ్ హరిచందన్(bishwabushan harichandan)​కు.. తెదేపా అధినేత చంద్రబాబు(chandrababu) లేఖ రాశారు. కరోనా తీవ్రతలో.. ఫ్రంట్​ లైన్ వారియర్లు, సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న పోలీసులు, ఇతర అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. వైకాపా ప్రభుత్వంలో ఓ వర్గం పోలీసులు ప్రజాస్వామ్య విధానాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు.  

గతేడాది మే నెలలో విశాఖలో ఎస్సీ వైద్యుడు సుధాకర్‌కు జరిగిన అన్యాయం మరవక ముందే.. అదే నగరంలో మరో ఎస్సీ యువతి పట్ల పోలీసుల వేధింపులు వెలుగులోకి వచ్చిందని ఆవేదన వెలిబుచ్చారు. అపోలోలో పని చేసే లక్ష్మి అపర్ణ.. విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుంటే పోలీసులు అడ్డుకుని వేధించారని ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లో ఫ్రంట్ లైన్ వారియర్లు, సాధారణ ప్రజలు కోవిడ్​పై పోరాడుతుంటే వారిపట్ల ప్రభుత్వం చిన్నచూపు తగదని హితవు పలికారు. సామాన్య ప్రజలను వేధింపులకు గురిచేస్తున్న వారిపై.. చర్యలుండేలా గవర్నర్‌ జోక్యం చేసుకోవాలని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు. 

ఇదీ చదవండి: 

CM Jagan Letter to PM Modi: 'పీఎంఏవై కింద రాష్ట్రాలకు నిధులివ్వండి'

Last Updated : Jun 8, 2021, 1:02 PM IST

ABOUT THE AUTHOR

...view details