Chandrababu fires on CM Jagan: సీఎం జగన్ పాలనతో అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా విసిగిపోయారని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, ముఖ్యనేతలు, మండల, డివిజన్ అధ్యక్షులతో ఆయన సమావేశమయ్యారు. 2024లో ఓడిపోతే వైకాపా ఉండదని జగన్‌కు అర్థమైందన్న చంద్రబాబు.. 'జగన్ సింహం కాదు పిల్లి'.. భయంతో అందరి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు.
గ్రామ స్థాయి నుంచి పార్టీలో చేరికలను ఆహ్వానించాలన్న ఆయన.. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించడానికి ప్రజలంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు. బాదుడే బాదుడు కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని నాయకులకు చంద్రబాబు సూచించారు.