ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్​ పేరు కనిపించేదా..!: చంద్రబాబు

CBN ON NTR HEALTH UNIVERSITY : తెలుగుదేశం ప్రభుత్వం కూడా జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్ పేరు ఎక్కడా ఉండేది కాదని మండిపడ్డారు. తెలుగుజాతికి ప్రతీకగా నిలిచే ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తొలగించడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. నిర్మాణానికి తట్ట మట్టి కూడా వేయనివాడు పేర్లు మార్చే నీచ సంస్కృతికి తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పిచ్చి చేష్టలతో పిచ్చి తుగ్లక్​గా చరిత్రలో జగన్మోహన్ రెడ్డి నిలిచిపోతారని దుయ్యబట్టారు. యూనివర్సిటీకి తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే వరకూ తెలుగుదేశం నిర్విరామ పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

CBN ON NTR HEALTH UNIVERSITY
CBN ON NTR HEALTH UNIVERSITY

By

Published : Sep 21, 2022, 7:33 PM IST

CBN FIRES ON CM JAGAN : తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటిన నందమూరి తారకరాముడి పేరు ఆరోగ్య వర్సిటీ నుంచి తొలగించి సీఎం జగన్ పెద్ద తప్పు చేశారని చంద్రబాబు మండిపడ్డారు. జగన్‌ మాదిరిగా తాను ఆలోచించి ఉంటే.. కడప జిల్లాకు వైఎస్సార్​ పేరు ఉండేదా అని ప్రశ్నించారు. సీఎం జగన్ నీచ సంస్కృతికి తెరలేపారన్న ఆయన.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఎన్టీఆర్​ పేరు పునరుద్ధరిస్తామని తేల్చి చెప్పారు. తెదేపా కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన తెదేపా బీసీ సాధికారక ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

జగన్​లా ఆలోచించి ఉంటే.. రాష్ట్రంలో వైఎస్సార్​ పేరు ఎక్కడా ఉండదు: చంద్రబాబు

"హెల్త్‌ యూనివర్సిటీకి మళ్లీ ఎన్టీఆర్‌ పేరు పెట్టేవరకు ఊరుకునేది లేదు. పేరు మార్చి జగన్‌ తన నీచ బుద్దిని బయటపెట్టుకున్నారు. నేను తలుచుకుంటే కడపకు వైఎస్సార్‌ పేరు ఉండేదా..? పేర్లు మార్చడం నాకు చేతకాదా..? కడపలో స్టీల్‌ ప్లాంట్‌ పెట్టి.. వైఎస్సార్‌ పేరు పెట్టుకోవచ్చు.. ఓ ఇరిగేషన్‌ ప్రాజెక్టు కట్టి.. వైఎస్సార్‌ పేరు పెట్టుకో..": - చంద్రబాబు

బీసీలకు అండగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్​ : బలహీనవర్గాల వారి వల్లే తెదేపా బలంగా ఉందని తెలిపారు. బలహీన వర్గాలకు అండగా నిలిచిన ఏకైక వ్యక్తి ఎన్టీఆర్‌ అని కొనియాడారు. గతంలోని నేతలు బీసీలను కేవలం ఓటుబ్యాంకుగా చూశారని.. కానీ ఎన్టీఆర్‌ అనేకమంది బీసీలకు కీలక పదవులు ఇచ్చారని వెల్లడించారు. బీసీల నాయకత్వాన్ని పెంచింది తెదేపా మాత్రమే అని.. అందుకోసం ఎన్టీఆర్‌ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తీసుకువచ్చారన్నారు.

స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు తెదేపా హయాంలో 33 శాతానికి పెరిగిందని.. వైకాపా పాలనలో బీసీ ఆ సంఖ్య 24 శాతానికి తగ్గిందని పేర్కొన్నారు. కేంద్రంలో ఏకైక కేబినెట్‌ పదవి అవకాశం వస్తే బీసీ అయిన ఎర్రన్నాయుడికు అవకాశం ఇచ్చామని.. నూటికి 90 శాతం ప్రజలు ఎప్పుడూ బీసీల వెంటే ఉన్నారని తెలిపారు. ఆదరణ పథకం ద్వారా కులవృత్తులను ప్రోత్సహించానని.. అత్యాధునిక పరికరాలను పంపిణీ చేశామన్నారు. జగన్‌ ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్ల ద్వారా ఎవరికైనా రుణాలు వచ్చాయా? అని నిలదీశారు.

దేశంలో గురుకుల పాఠశాలలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని చంద్రబాబు కొనియాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల కోసం ప్రత్యేక గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేశామని.. బీసీ విద్యార్థుల కోసం విదేశీ విద్యా పథకం తీసుకువచ్చామన్నారు. ఆనాడు నేను ఐటీ గురించి మాట్లాడితే విమర్శించారని.. సెల్‌ఫోన్ల కోసం కృషి చేస్తే.. సెల్‌ఫోన్‌ తిండి పెడుతుందా అన్నారని చంద్రబాబు గుర్తు చేశారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details