ఇచ్చిన హామీలను ప్రస్తావిస్తే తప్పు అనడమేంటి? చంద్రబాబు - tdp chief chandrababu fire on ycp govt over tdp mlas susprnssion
తెదేపా పక్ష డిప్యూటీ లీడర్లను సభ నుంచి సస్పెన్షన్ చేయడాన్ని ఆ పార్టీ అధినేత చంద్రబాబు తీవ్రంగా తప్పుబట్టారు. కేవలం ప్రభుత్వ హామీలను గుర్తు చేస్తే తప్పు అనటం ఎంతమేరకు సమంజసం అని ప్రశ్నించారు.

శాసనసభలో తెదేపా శాసనసభాపక్ష ఉపనేతల్ని సస్పెన్షన్ చేయటంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. ముందస్తు ప్రణాళికలో భాగంగానే సస్పెండ్ చేశారని అర్థమవుతోందని వ్యాఖ్యానించారు. బీసీ నాయకుడైన అచ్చెన్నాయుడిని సస్పెండ్ చేసి బీసీ బిల్లు పెట్టడాన్ని ఎలా చూడాలంటూ ప్రశ్నించారు. రాష్ట్రమంతా అభద్రతా భావం నెలకొందని... ప్రభుత్వంలో అసహనం పెరిగిపోతుందని దుయ్యబట్టారు. భవిష్యత్తు కార్యాచరణపై టీడీఎల్పీలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. కేవలం ప్రభుత్వం ఇచ్చిన హామీలను గుర్తు చేస్తుంటే.. వాళ్లు మాత్రం తప్పు అంటున్నారని అన్నారు.