చిలక మామిడి గ్రామస్థుల తాగునీటి అవస్థలపై... చంద్రబాబు ఆవేదన - ఏపీ లేటెస్ట్ అప్డేట్స్
Chandrababu on water problems: అల్లూరి సీతారామరాజు జిల్లాలో ప్రజల నీటి అవస్థలపై తెదేపా అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలో నీటి ట్యాంక్ మోటార్లు పాడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీటి అవస్థలకు సంబంధించిన ఫోటోలను చంద్రబాబు తన ట్విట్టర్‌కు జత చేశారు.
Chandrababu on water problems: అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం చిలక మామిడి గ్రామస్థుల తాగునీటి అవస్థలు చూస్తే బాధేస్తోందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 150 గిరిజన కుటుంబాలు నివాసముండే ఈ గ్రామంలో నీటి ట్యాంక్ మోటార్లు పాడయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరమ్మతులు చేయడానికి కూడా వీలులేకుండా పంచాయితీల నిధులు దోచేశారని ధ్వజమెత్తారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి పనులు చేయించినా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని మండిపడ్డారు. చేసేది లేక ఆదివాసీ ప్రజలు కొండ వాగు చెంత చెలమ నీటినే తాగుతున్నారన్నారు. ఇలా అయితే వారి ఆరోగ్య పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు సురక్షిత తాగునీటిని ఇవ్వలేని చేతకాని ప్రభుత్వం దీనికి ఏం సమాధానం చెపుతుందని నిలదీశారు. నీటి అవస్థలకు సంబంధించిన ఫోటోలను చంద్రబాబు తన ట్విట్టర్‌కు జత చేశారు.