ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Chandrababu: ఎల్లుండి నుంచి చంద్రబాబు జిల్లాల పర్యటన - ఏపీ లేటెస్ట్ అప్​డేట్స్

Chandrababu districts tour: మే 4 నుంచి చంద్రబాబు పలు జిల్లాల్లో పర్యటించనున్నారు. పెంచిన విద్యుత్‌, ఆర్టీసీ ఛార్జీలు, పన్నులపై తెదేపా నిరసనలు, మహానాడు వరకు వివిధ జిల్లాల్లో 'బాదుడే బాదుడు' కార్యక్రమాల్లో పాల్గొంటారు.

Chandrababu districts tour
చంద్రబాబు జిల్లాల పర్యటన

By

Published : May 2, 2022, 2:22 PM IST

Chandrababu districts tour: తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'బాదుడే బాదుడు' నిరసన కార్యక్రమాల్లో భాగంగా మే 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనలు చేపట్టనున్నారు. 4వ తేదీ శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస నియోజకవర్గం దల్లావలస గ్రామంలో చంద్రబాబు పర్యటించనున్నారు. 5వ తేదీ భీమిలి నియోజకవర్గం తాళ్లవలస గ్రామంలో, 6వ తేదీ ముమ్మడివరం నియోజవర్గం కోరింగ గ్రామంలో 'బాదుడే బాదుడు' కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రభుత్వం పెంచిన విద్యుత్, ఆర్టీసీ ఛార్జీలు, వివిధ రకాల పన్నులపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 'బాదుడే బాదుడు పేరిట తెలుగుదేశం నేతలు నిరసనలు చేపడుతున్నారు. మహానాడు వరకు వివిధ జిల్లాల్లో బాదుడే బాదుడు కార్యక్రమంలో చంద్రబాబు పర్యటనలకు ప్రణాళికలు ఖరారయ్యాయి.

ABOUT THE AUTHOR

...view details