Chandrababu condolences to Yadlapati: తెదేపా సీనియర్ నేత యడ్లపాటి వెంకట్రావు భౌతికకాయానికి..హైదరాబాద్లోని నివాసంలో చంద్రబాబు నివాళులర్పించారు. కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. రైతునేతగా, ప్రజాసేవకుడిగా ఆయన చిరస్థాయిగా నిలిచిపోతారని కొనియాడారు. రాజకీయాల్లోకి వచ్చేవారికి ఆయన జీవితం ఆదర్శమన్నారు.
యడ్లపాటి వెంకటరావు మృతి చాలా బాధాకరమన్న చంద్రబాబు.. సంగం డెయిరీ, జంపని షుగర్ ఫ్యాక్టరీ స్థాపనకు కృషిచేశారని కొనియాడారు. యడ్లపాటి వెంకటరావు అజాతశత్రువన్న ఆయన.. పదవులకే వన్నె తెచ్చిన వ్యక్తి అని అన్నారు. పదవుల కోసం కాకుండా ప్రజలకు మేలు చేసేందుకు పని చేశారని చంద్రబాబు గుర్తు చేశారు.