ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

CBN: స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలి: చంద్రబాబు - స్థానిక సంస్థల ఎన్నికలు

రాష్ట్రంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలని శ్రేణులకు తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వీటిని ప్రజాస్వామ్య పరిరక్షణ ఎన్నికలుగా భావించాలని సూచించారు. అధికారపార్టీ దౌర్జన్యాలు, అక్రమాలను ఎదుర్కొనేందుకు అవసరమైతే తానే క్షేత్రస్థాయిలో పోరాటానికి దిగుతానని స్పష్టం చేశారు.

TDP CHANDRABABU
TDP CHANDRABABU

By

Published : Nov 5, 2021, 4:43 AM IST

Updated : Nov 5, 2021, 6:43 AM IST

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోరాడాలి

రాష్ట్రంలో మలిదశ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించి..ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకతను చాటిచెప్పాలని తెలుగుదేశం శ్రేణులకు చంద్రబాబు పిలుపునిచ్చారు. గత ఎన్నికల్లో వైకాపా అధికార దుర్వినియోగానికి పాల్పడిందంటూ ఎన్నికలు బహిష్కరించిన తెలుగుదేశం..ఈసారి మాత్రం పోరాట పంథా అవలంభించాలని నిర్ణయించుకుంది. పార్టీ కేంద్ర కార్యాలయంపై జరిగిన దాడితో తెలుగుదేశం శ్రేణులు, అభిమానుల్లో పెద్దఎత్తున ఆగ్రహం కట్టలు తెచ్చుకుందని..ఆ ఆవేశాన్ని స్థానిక ఎన్నికల్లో చూపించాలని చంద్రబాబు కోరారు. అధికార పార్టీ దౌర్జన్యాలతో గత ఎన్నికల్లో నామినేషన్ల వేయలేకపోవడం, బెదిరింపులతో ఉపసంహరించుకోవడంతో..ఈసారి ముందునుంచే అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. దిగువస్థాయి శ్రేణులకు ఎప్పటికప్పుడు అండగా నిలిచేందుకు సీనియర్ నేతలు, నాయకులు, అనుబంధ విభాగాల అధ్యక్షులకు బాధ్యతలు అప్పగించి క్షేత్రస్థాయిలో మోహరించామన్నారు.

స్థానిక ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏమాత్రం చర్యలు చేపట్టలేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో అక్రమాలకు పాల్పడ్డారని తాము ఫిర్యాదు చేసిన అధికారులనే మళ్లీ ఎన్నికల విధులు అప్పగించడంపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల సంఘం తీరును సైతం తప్పుబట్టారు. వైకాపా నేతల దౌర్జన్యాలతో నామినేషన్‌ దాఖలు చేయలేకపోయిన బాధితులతో నేరుగా ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. పార్టీ అన్నివిధాల అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు సొంతనియోజకవర్గం కుప్పం కూడా ఉండటంతో తెలుగుదేశం స్థానిక ఎన్నికలను మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

ఇదీ చదవండి:

రెండు చోట్ల.. తారాజువ్వలు పడి ఫర్నిటర్ దగ్ధం

Last Updated : Nov 5, 2021, 6:43 AM IST

ABOUT THE AUTHOR

...view details