రాష్ట్రంలో కల్తీ సారా నిర్మూలన, మద్యం షాపుల్లో జే-బ్రాండ్స్‌ను నిషేధించాలని డిమాండ్‌తో తెలుగుదేశం పార్టీ ఆందోళనలకు సిద్ధమైంది. అధిష్ఠానం అదేశాల మేరకు ఈనెల 19, 20 తేదీల్లో.. అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో పార్టీ శ్రేణులు నిరసనలు చేపట్టనున్నారు.
నాణ్యత లేని, కల్తీ మద్యం వల్ల ప్రాణాలు పోవడంతోపాటు జనారోగ్యం దెబ్బతింటుందని.. వీటిని వెంటనే నిషేధించాలని తెదేపా నేతలు డిమాండ్ చేశారు. జే-బ్రాండ్స్ మద్యంతో మహిళల తాళిబొట్లు తెంపేస్తున్నారని.. ఇంత జరుగుతున్నా కమీషన్ల కోసమే జగన్ సర్కార్ పనిచేస్తుందని ఆరోపించారు. కల్తీ సారా, జె బ్రాండ్స్‌పై అసెంబ్లీలో ఎమ్మెల్యేల పోరాటానికి మద్దతుగా.. వాడవాడలో యుద్దానికి తెదేపా సిద్దమైందన్నారు.