ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఇన్​సైడర్​ ట్రేడింగ్​పై విచారణ జరిపించండి' - tdp bonda uma on capital

విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా అభివృద్ధి చేస్తామన్న సీఎం జగన్​ వ్యాఖ్యల వెనుక వైకాపా స్వప్రయోజనాలే ఉన్నాయంటూ తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆరోపించారు. ఇన్​సైడర్​ ట్రేడింగ్​ జరిగిందంటూ చేస్తున్న ఆరోపణలపై జ్యుడీషియల్​ విచారణ జరిపించాలని డిమాండ్​ చేశారు.

'ఇన్సైడ్​ ట్రేడింగ్​పై జ్యుడిషియరీ​ ఎంక్వయిరీ వేయండి'
'ఇన్సైడ్​ ట్రేడింగ్​పై జ్యుడిషియరీ​ ఎంక్వయిరీ వేయండి'

By

Published : Dec 24, 2019, 11:33 PM IST

'ఇన్​సైడర్​ ట్రేడింగ్​పై విచారణ జరిపించండి'

రాజధాని అమరావతి అంశంలో ఇన్​సైడర్​ ట్రేడింగ్ జరిగిందంటూ చెబుతున్న వైకాపా ప్రభుత్వం... కమిటీలు వేసినా ఎందుకు నిరూపించలేకపోయిందని తెదేపా మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావు ప్రశ్నించారు. దీనిపై జ్యుడీషియల్​ ఎంక్వయిరీ వేయాలని సవాల్​ విసిరారు. విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా చేస్తామన్న సీఎం జగన్​ వ్యాఖ్యల వెనుక వైకాపా నాయకుల స్వప్రయోజనాలే ఉన్నాయన్నారు. అమరావతిని చంపేయడమంటే ఒక సామాజిక వర్గాన్నో, పార్టీనో, ఆ ప్రాంతాన్నో దెబ్బ తీయడం కాదని... 5 కోట్ల ఆంధ్రుల మనోభావాలను దెబ్బతీయడమే అని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ దెబ్బతో లులు గ్రూప్, అదాని వంటి పెద్ద సంస్థలు వెనక్కి వెళ్లిపోయాయన్నారు. కృష్ణా , గుంటూరు జిల్లాల ఎమ్మెల్యేలు, ఎంపీలు అమరావతిపై స్పందించాలని... లేదంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారంటూ వ్యాఖ్యానించారు. ఏ ఉద్దేశ్యంతో అమరావతిని భవిష్యత్ తరాల కోసం నిర్మించ తలపెట్టామో అది కొనసాగించాలన్నారు. ఇది 29 గ్రామాల సమస్యకాదని... మనందరీ సమస్య అని తెలిపారు. సేవ్ అమరావతి అనే నినాదంతో రాజధానిని కాపాడుకోవడానికి అందరూ కలిసి రావాలన్నారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details