బీసీలకు రిజర్వేషన్లు తగ్గడంపై గవర్నర్కు తెదేపా ఫిర్యాదు - గవర్నర్ను కలిసిన తెదేపా బీసీ నేతలు న్యూస్
బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లు పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలని తెదేపా బీసీ నేతలు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ల పరంగా అన్యాయం జరుగుతోందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. 94 నుంచి 2013 వరకు బలహీన వర్గాలకు 34 శాతం రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు. ప్రస్తుతం ఆ శాతం తగ్గటానికి కారణాలపై సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. బీసీలకు న్యాయం చేసే విషయంలో అన్నిపార్టీలను కలుపుకొని పోతామని అచ్చెన్నాయుడు చెప్పారు.
గవర్నర్ను కలిసిన తెదేపా బీసీ నేతలు
.